బండి భగీరథ్ పోక్సో కేసు: మేడ్చల్ కోర్టులో బాధితురాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-16 12:58:53  IST  )

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరైంది. మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చింది.

బండి భగీరథ్ పోక్సో కేసు: మేడ్చల్ కోర్టులో బాధితురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరైంది. మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా, తాజాగా బాధితురాలితో పాటు తల్లి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు ఇప్పటికే తన కుమార్తెను మద్యం సేవించమని బండి భగీరథ్ ఒత్తిడి చేసి.. ఆమె బలహీన స్థితిలో ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన కుమార్తె చాలా రోజులు అవమానంగా.. మానసిక వేదనను అనుభవించిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని.. నిజానిజాలు తప్పకుండా బయటికి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story