- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో తండ్రి తిట్టాడని.. హాస్టల్ పై నుంచి దూకి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
అతను చేసిన పనికి తండ్రి తీవ్రంగా తిట్టడంతో మనస్తాపం చెందిన బీటెక్ సెకండియర్ స్టూడెంట్.. హాస్టల్ భవనం నాల్గవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: అతను చేసిన పనికి తండ్రి తీవ్రంగా తిట్టడంతో మనస్తాపం చెందిన బీటెక్ సెకండియర్ స్టూడెంట్.. హాస్టల్ భవనం నాల్గవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ఏరియాలో జరిగింది. శనివారం (జనవరి 24) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతుడిని ఝాన్సీ జిల్లావాసి అయిన ఉదిత్ సోని (24)గా గుర్తించారు. ఉదిత్ హాస్టల్ పైనుంచి దూకడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
గ్రేటర్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (జనవరి 23) రాత్రి ఉదిత్ సోని, అతని స్నేహితులైన చేతన్, కుల్ దీప్ లతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం నాలెడ్జ్ పార్క్ -3లో ఉన్న తన హాస్టల్ కు వెళ్లాడు. ఉదిత్ మద్యం సేవించినట్లు గమనించిన హాస్టల్ యాజమాన్యం.. అతన్ని మందలించంది. ఆపై ఉదిత్ వీడియోను రికార్డ్ చేసి తండ్రి విజయ్ సోనికి పంపింది. దీంతో విజయ్ కోపంగా ఉదిత్ కు ఫోన్ చేసి తిట్టారు. ఇలా చేస్తే హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోతానని హెచ్చరించారు. తండ్రి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉదిత్.. హాస్టల్ పైనుంచి దూకి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






