- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైనర్ లారీని ఢీకొన్న ఆటో.. స్పాట్‌లోనే ఆరుగురు కూలీలు దుర్మరణం
కంటైనర్ లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాగేపల్లి (Bagepalli) సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ (Container) లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మృతులంతా రోజువారీ పనుల కోసం వెళ్తున్న కూలీలుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పాట్‌కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.






