పట్టపగలే మాజీ భార్యపై హత్యాయత్నం.. హీరోలా వచ్చి కాపాడిన స్థానికులు

by Ajay Maddhiboyina |

బెంగ‌ళూరులో దారుణం చోటు చేసుకుంది. మ‌ద‌నాయ‌క‌న‌హ‌ళ్లిలో త‌న మాజీ భార్య రోడ్డు పై న‌డుచుకుంటూ వెళుతుంటో ఆమె భ‌ర్త సంజ‌య్ స్కూటీపై వ‌చ్చి హ‌త్యాయ‌త్నం చేశాడు.

పట్టపగలే మాజీ భార్యపై హత్యాయత్నం.. హీరోలా వచ్చి కాపాడిన స్థానికులు
X

దిశ, వెబ్ డెస్క్: బెంగ‌ళూరులో దారుణం చోటు చేసుకుంది. మ‌ద‌నాయ‌క‌న‌హ‌ళ్లిలో త‌న మాజీ భార్య రోడ్డు పై న‌డుచుకుంటూ వెళుతుంటో ఆమె భ‌ర్త సంజ‌య్ స్కూటీపై వ‌చ్చి హ‌త్యాయ‌త్నం చేశాడు. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో దాడిచేసే ప్ర‌య‌త్నం చేయ‌గా రోడ్డుపై వెళుతున్న వ్య‌క్తులు అత‌డిని అడ్డుకున్నారు. మొద‌ట ఒక వ్య‌క్తి వ‌చ్చి సంజ‌య్ ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అత‌డు ఆమెను విడిచిపెట్ట‌కుండా క‌త్తితో పొడిచే ప్ర‌య‌త్నం చేశాడు. వెంట‌నే ప‌క్క‌న ఉన్న మ‌రో ముగ్గురు వ‌చ్చి మ‌హిళ‌ను విడిపించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ వ్య‌క్తి హెల్మెట్ తో నిందితుడిపై దాడి చేశాడు.

ఈ క్ర‌మంలో దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక సంజ‌య్ త‌న మాజీ భార్య‌ను విడిచిపెట్టాడు. అనంత‌రం నిందితుడికి స్థానికులు దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌న్నివేశాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. సాధార‌ణంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ప్పుడు రోడ్డుపై వెళుతున్న‌వాళ్లు చూసి చూడ‌న‌ట్టు వ‌దిలేస్తారు. కానీ ఈ ఘ‌ట‌న‌లో స్థానికులు వెంట‌నే స్పందించి అడ్డుకోవ‌డంతో మ‌హిళ ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు. దీంతో నెటిజ‌న్లు స్థానికులు హీరోల్లా స్పందించారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story