- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నం.. ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు
కడప జిల్లా ఖాజీపేటలో యువతిని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలోని ఖాజీపేటలో యువతిని గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ తెల్లవారుజామున విచారణ నిమిత్తం మైదుకూరు నుంచి తరలిస్తుండగా బసాపురం చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచి కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా నిందితుడు లొంగిపోకపోవడంతో, పోలీసులు అనివార్యంగా మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు వెంకటేశ్ మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా, ప్రేమ పేరుతో వేధిస్తూ, కాదన్న కోపంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ప్రేమోన్మాది చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.






