- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో న్యాయవాదిపై హత్యాయత్నం.. కారుతో ఢీ కొట్టి పరారైన నిందితులు
హైదరాబాద్ లో పట్టపగలే న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే దుండగులు కారుతో వచ్చి ఢీ కొట్టి అక్కడ నుండి పరార్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్:హైదరాబాద్ లో పట్టపగలే న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే దుండగులు కారుతో వచ్చి ఢీ కొట్టి అక్కడ నుండి పరార్ అయ్యారు. ఈ ఘటన మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో జరిగింది. ఉదయం న్యాయవాది కాజా మొయినుద్దీన్ ఇంటి నుండి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఆయన కారు డోర్ తీస్తున్న సమయంలో అప్పటికే ఆయన ఇంటి పక్కన దుండగులు కాపు కాస్తూ ఉన్నారు. ఆయన కారులో ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో వెనకనుండి ఒక్కసారిగా వేగంగా వచ్చి ఢీ కొట్టారు. దాడితో మొయినుద్దీన్ ఎగిరి కిందపడిపోయారు. ఆయనకు తీవ్రగాయాలు కాగా ఢీ కొట్టిన వెంటనే నిందితులు అక్కడ నుండి పరార్ అయ్యారు. ప్రస్తుతం న్యాయవాది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం హత్యాయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






