- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి
రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. బస్సు ఆపలేదని, సీటు దొరకలేదని ఇలా రకరకాల

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. బస్సు ఆపలేదని, సీటు దొరకలేదని ఇలా రకరకాల కారణాలతో కండక్టర్లపై ప్రయాణికులు దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నగరంలోని ఫలక్ నుమా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్ ప్రయాణికురాలి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో డ్రైవర్ బస్సు ఆపగా కిందికి దిగిన తరవాత ప్రయాణికురాలు బూతులు తిడుతూ కండక్టర్ పై దాడి చేసింది. బస్సు ఆపాలని ప్రయాణికురాలు కోరగా ఎక్కడ పడితే అక్కడ ఆపము అని చెప్పినందుకు డ్రైవర్, కండక్టర్ లపై మహిళ దాడి చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగటంలేదు. video
Next Story






