గర్భిణీ మహిళపై దాడి.. నిందితుడికి బహిరంగ ఊరేగింపు

by Ajay Maddhiboyina |

గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు బ‌హిరంగంగా ఊరేగించారు. ఈ ఘ‌ట‌న శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో చోటు చేసుకుంది. క‌దిరిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు ట‌పాకాయలు కాలుస్తూ కేక‌లు వేస్తూ

గర్భిణీ మహిళపై దాడి.. నిందితుడికి బహిరంగ ఊరేగింపు
X

దిశ‌, వెబ్ డెస్క్: గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు బ‌హిరంగంగా ఊరేగించారు. ఈ ఘ‌ట‌న శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో చోటు చేసుకుంది. క‌దిరిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు ట‌పాకాయలు కాలుస్తూ కేక‌లు వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్ర‌మంలో సంధ్యారాణి అనే గ‌ర్భిణి ఇబ్బంది ప‌డుతూ త‌మ ఇంటివ‌ద్ద ట‌పాకాయ‌లు కాల్చ‌వ‌ద్ద‌ని చెప్పింది. దీంతో ఆగ్ర‌హించిన వైసీపీ కార్య‌క‌ర్త అజ‌య్ దేవా ఆమెపై దాడి చేశాడు. మ‌హిళ క‌డుపుపై తంతూ ర‌క్తం వ‌చ్చేలా దాడి చేశాడు.

వెంట‌నే మ‌హిళ‌ను కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ దారుణానికి పాల్ప‌డిన అజ‌య్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్ల స్టైల్ లో కోటింగ్ ఇచ్చారు. అక్క‌డితో ఆగ‌కుండా భ‌విష్య‌త్ లో ఇలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా హెచ్చ‌రిస్తూ క‌దిరి ప‌ట్ట‌ణం న‌డిబొడ్డున అత‌డిని ఊరేగించారు. మ‌రొక‌రు ఇలాంటి ఆడుల‌కు పాల్ప‌డ‌కుండా పోలీసులు నిందితుడికి ట్రీట్మెంట్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక మ‌రో నిందితుడు పరారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అత‌డికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story