- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి.. వెలుగులోకి షాకింగ్ వీడియో
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ చైతన్యపురిలో బుధవారం రాత్రి 11 గంటలకు కిరటీ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తన కారు అద్దం పగలగొట్టారని ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడు. ఘటనా స్థలానికి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా నానా హంగామా సృష్టించాడు.
తన బట్టలు విప్పేసి పోలీసులపైనా దాడి చేశాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంలో వెలుగులోకి రాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






