ఏపీలో ప్ర‌భుత్వాసుప‌త్రి డాక్ట‌ర్లు, సిబ్బందిపై దాడి

by Ajay Maddhiboyina |

ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బందిపై కొంతమంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది.

ఏపీలో ప్ర‌భుత్వాసుప‌త్రి డాక్ట‌ర్లు, సిబ్బందిపై దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బందిపై కొంతమంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగ్గా గాయపడిన వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తిని కొట్టేందుకు మరోసారి దాడి చేసిన వ్యక్తులు ఆస్పత్రి వద్దకు వచ్చారు.

ఈ క్రమంలో డాక్టర్లు, సిబ్బందితో వాగ్వాదికి దిగి వారిపైనా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. కాగా ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి కిందపడేసిన భ‌యంక‌ర దృష్యాలు క‌నిపిస్తున్నాయి. త‌మ‌పై దాడి చేయ‌డంతో క‌దిరిలో డాక్ట‌ర్లు విధులు బ‌హిష్క‌రించారు. దాడి చేసిన వ్య‌క్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. video

Next Story