- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Warangalలో దారుణం.. తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు..
వరంగల్లో దారుణ చోటు చేసుకుంది. కన్న తల్లిని రోకలిబండతో కుమారుడు కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన వరంగల్ లోని లెనిన్ కాలనీలో చోటు చేసుకుంది.

X
దిశ, ఎంజీఎం సెంటర్/మామునూర్: కన్నతల్లిని మట్టి గజం కొమరమ్మ (80) బుధవారం ఉదయం సుమారు 10:15 గంటల సమయంలో రోకలి బండతో కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలోని ఆర్. టి.ఓ జంక్షన్ లెనిన్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు.
దీంతో వారిని ఆపడానికి ప్రయత్నించిన కన్నతల్లిని మట్టి గజం కొమరమ్మ(80) ని చిన్న కుమారుడు మట్టి గజం కృష్ణ బలంగా పక్కన ఉన్న రోకలి బండతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులులు సంఘటన స్థలానికి పరిశీలించి, నిధితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మామునూర్ ఎస్సై రాజేష్ రెడ్డి తెలియజేశారు.
Also Read....
Next Story






