- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిమ్మాజిపేటలో దారుణం: ఆ కోరిక తీర్చలేదని మహిళ గొంతు కోసిన కామాంధుడు..!
by Taduka Kalyani |
లైంగిక కోరిక తీర్చలేదన్న కారణంతో ఓ కామాంధుడు మహిళ గొంతు కోసి పరారయ్యాడు.

X
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: లైంగిక కోరిక తీర్చలేదన్న కారణంతో ఓ కామాంధుడు మహిళ గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినసరి కూలీగా పనిచేస్తున్న మహిళ (40) ని, అదే గ్రామానికి చెందిన కొత్త దేవయ్య తరచూ లైంగికంగా వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన సంభాషణలో గొడవకు దారితీయగా మండల కేంద్రంలోని స్మశాన వాటిక వద్ద దేవయ్య మహిళ వెనకనుంచి గొంతు కోసి పరారయ్యాడు. వెంటనే కేకలు వేస్తూ పోలీస్ స్టేషన్ వైపు మహిళ పరుగులు పెట్టింది. స్థానికులు గమనించి వెంటనే 108 వాహనం సాయంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






