- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఘోరం చోటుచేసుకుంది. లంగర్ హౌస్ (Translating...) పరిధిలోని ‘హోటల్ గ్రాండ్’ లాడ్జ్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. పోలీసులు కథనం మేరకు రేణుక (Renuka) అనే యువతి గురువారం రాత్రి ఫారుక్ (34)తో రూమ్ బుక్ చేసుకుంది.
ఈ క్రమంలోనే పని మీద ఫారుక్ బటయకు వెళ్లి తిరిగి రూమ్‌కు చేరుకున్నాడు. ముందుగా డోర్ ఓపెన్ చేయగానే రేణుక అచేతన స్థితిలో పడి ఉందని, ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఫారుక్ లంగర్‌హౌస్‌కు సమాచారం అందజేశాడు. ఈ మేరకు వారు స్పాట్‌కు చేరుకుని గదిని క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను కూడా సేకరించారు. అయితే, మరోవైపు రేణుకది ఆత్మహత్య కాదని.. హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫారుక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేణుకది హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.






