ఆదిలాబాద్‌లో దారుణం.. భార్యను చంపిన భర్త

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-26 08:04:59  IST  )

ఆదిలాబాద్‌లో దారుణం.. భార్యను చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్/నేరడిగొండ: ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు పెడదారి పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత క్షీణిస్తోంది. పరస్పర విశ్వాసం తగ్గిపోవడం, సంయమనం లోపించడం, అక్రమ సంబంధాలు పెరగడం వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక ఇంట్లో కలసిమెలసి జీవించాల్సిన భార్యాభర్తలు ఇప్పుడు మనుషులుగా కాకుండా శత్రువులుగా మారిపోతున్నారు. చిన్న చిన్న గొడవలు కూడా ఘర్షణలకు దారితీయడమే కాకుండా, హత్యలు చేయడం నిత్య ఘటనలుగా మారిపోతున్న పరిస్థితి కలవరపెడుతోంది. రోజూ ఎక్కడో ఓ చోట 'భార్యను చంపిన భర్త' లేదా 'భర్తను హత్య చేసిన భార్య' అనే వార్తలు టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఒక ఘటన మరవకముందే మరో దారుణ సంఘటన వెలుగుచూస్తుండడం సమాజాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టుతోంది. తాజాగా రాష్ట్రంలో జరిగిన మరో హృదయవిదారక ఘటన మానవ సంబంధాల దారుణ వికృత రూపాన్ని మరోసారి మేల్కొలిపింది.

ఆదిలాబాద్ జిల్లా (Adilabad) నేరడిగొండ మండలంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. దరిబితండాకు చెందిన సుజాత(21) అనే మహిళను ఆమె భర్త నటరాజ్‌ దారుణంగా హత్యచేశాడు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన నటరాజ్ సుజాతను గొంతు నులిమి చంపేసినట్లు (Husband killed his wife) తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మృతిరాలి కుటుంబీకులు గురువారం ఉదయం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అడ్డు వచ్చిన పోలీసులపై దాడి చేశారు. మృతిరాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిని ఏఎస్పీ కాజల్‌సింగ్‌ పరిశీలించి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.

Next Story