- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి సామూహిక అత్యాచారం
సమాజంలో అత్యాచారాల ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో అత్యాచారాల ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. కామాంధుల అరాచకాలకు అంతులేకుండా పోతుంది. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడమే పాపంగా మారింది. మహిళలు కనిపిస్తే చాలు వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారు దానికి నిరాకరిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వేనకాడటం లేదు. తాజాగా, రాజస్థాన్‌లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన గోతిలోంచి బయటకు తీసి మరి సామూహిక అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించి మహిళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళ మృతదేహానికి ఆమె కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించి బాడిని గోతిలో పాతిపెట్టారు. అయితే అదే రోజు రాత్రి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాంత్రిక పూజల పేరుతో మృతదేహాన్ని బయటకు తీసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. శ్మశానంలో మాటలు వినబడటంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని కామాంధులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లు.. తాంత్రిక పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.






