కామారెడ్డి జిల్లాలో దారుణం.. అల్లుడి పై గొడ్డ‌లితో దాడి

by Ratna Kumari |

దిశ, ​గాంధారి : కామారెడ్డి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వి

కామారెడ్డి జిల్లాలో దారుణం.. అల్లుడి పై  గొడ్డ‌లితో దాడి
X

దిశ, ​గాంధారి : కామారెడ్డి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. వరుసకు మామ అయ్యే వ్యక్తి తన అల్లుడి పై గొడ్డలితో దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదెల్లి గ్రామానికి చెందిన నర్సింహులు, అతనికి వరుసకు అల్లుడు అయ్యే రంజిత్, మరో వ్యక్తి బాలయ్య కలిసి నిన్న రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో పాత పట్టింపుల విషయంలో రంజిత్, నర్సింహులు మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహానికి లోనైన నర్సింహులు గొడ్డలితో రంజిత్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు.


బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు నర్సింహులుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు. ​ఈ గొడవకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదు.​ఇది కేవలం వ్యక్తిగత కారణాలు, మద్యం మత్తులో జరిగిన గొడవ మాత్రమేన‌ని తెలిపారు. ​నిందితుడు, బాధితుడు ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై అనవసరంగా పుకార్లు సృష్టించవద్దు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని ఎస్సై ఆంజ‌నేయులు హెచ్చరించారు.

Next Story