- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పాస్టర్ అభినయ దర్శన్ పై దాడి.. సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇటీవల భరోసా పేరుతో కొత్త రాజకీయపార్టీని స్థాపించిన పాస్టర్ అభినయ దర్శన్ పై కొందరు దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇటీవల భరోసా పేరుతో కొత్త రాజకీయపార్టీని స్థాపించిన పాస్టర్ అభినయ దర్శన్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నియెజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలం నీరుతోటపాలెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పాస్టర్, మరో ముగ్గురిపై కత్తులతో దాడి చేశారు. దుండగులు ముసుగులతో వచ్చి పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ దాడి చేసినట్టు తెలుస్తోంది. మొదట కారును గుడ్లు విసిరిన దుండగులు తరవాత ఆయుధాలు, కత్తులతో ఒక్కసారిగా దాడిచేసినట్టు బాధితులు చెబుతున్నారు. దాడి తరవాత పాస్టర్ తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడిపోగా స్థానికులు అక్కడకు చేరుకుని వెంటనే చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దాడి తరవాత ఆస్పత్రిలో అభినయ దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను కూడా చంపాలని చూస్తున్నారు అంటూ పాస్టర్ అభినయ దర్శన్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై తానే దాడి చేసుకున్నట్టు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా పాస్టర్లు అందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి జరగటం వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దాడితో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకి సంబంధం ఉందని అనుకోవడంలేదని చెప్పారు.






