- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదంగా ఆశ్రమ స్కూల్ విద్యార్థి మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ ఆశ్రమ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ ఆశ్రమ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గంగపూర్ గ్రామానికి చెందిన దుర్వా అన్వేష్ 10. జైనూర్ లోని పనపాటర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 4 తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అన్వేష్ హాస్టల్ లో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతని మృతి చెందాడు. ఉపాధ్యాయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక పరీక్షలు ఉండటం వల్ల ఇటివలే హాస్టల్ లో తన కొడుకును వదిలి వెళ్ళినట్లు తండ్రి చెప్పారు. ఈ క్రమంలో అస్వస్థత గా ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వెల్లే లోపు అన్వేష్ మృతి చెందాడని.! హాస్టల్ లో పిల్లలు కొట్టుకున్నారా, లేక భవనం పై నుంచి పడి మృతి చెందాడని తెలియకుండా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని.. తాను పలుమార్లు ఫోన్ చేసిన ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక విద్యార్థి మృతి పై అక్కడి ఆశ్రమ స్కూల్ సిబ్బంది ఎలాంటి ప్రకటన చేయలేదు.






