- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arrest: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేళ బెట్టింగ్ జోరు.. ఐదుగురు బుకీలు అరెస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా టైటిల్ కోసం టీమిండియా (Team India), న్యూజిలాండ్ (New Zealand) జట్టుతో తలపడబోతోంది. ఈ క్రమంలో తుది పోరులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక ఫైనల్ మ్యాచ్‌పై సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలో ఇప్పటికే ప్రెడిక్షన్ల (Predictions) పర్వం కొనసాగుతోంది. కొందరు భారత్ (India) టైటిల్‌ను సొంతం చేసుకోబోతోందని జోస్యం చెబుతుంటే.. మరికొందరు న్యూజిలాండ్ (New Zealand)దే కప్పు అని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఇండియా - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌పై దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ (Delhi), హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bengaluru), ముంబై (Mumbai), కల్‌కతా (Kolkata)లో జోరుగా గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజు దుబాయ్ వేదికగా రూ.5 వేల కోట్ల మేర చేతులు మారబోతున్నట్లుగా విశ్వసనీయగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ (Delhi) పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ.22 లక్షల లిక్విడ్ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






