- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పులతో దద్దరిల్లిన ఆర్మీ క్యాంప్.. ముగ్గురు సైనికులకు గాయాలు
ఆర్మీ క్యాంప్ (Army Camp)పై గుర్తు తెలియని దుండగుల గ్రనైడ్లతో దాడికి పాల్పడిన ఘటన అస్సాం (Assam)లోని తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపతర్‌లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మీ క్యాంప్ (Army Camp)పై గుర్తు తెలియని దుండగుల గ్రనైడ్లతో దాడికి పాల్పడిన ఘటన అస్సాం (Assam)లోని తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపతర్‌లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంటల సమయంలో భారత సైన్యంలోని 19 గ్రెనడియర్స్ యూనిట్ శిబిరంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనైడ్లు విసిరినట్లుగా తెలుస్తోంది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పేలుళ్లలో ముగ్గురు సైనిక సిబ్బంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలం చుట్టూ 2 నుంచి 3 కి.మీ మేర పరిధిని మూసివేసి పౌరుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
కాగా, దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీప అడవులు, గ్రామాల్లో సైన్యం, స్థానిక పోలీసులు, అస్సాం రైఫిల్స్ (Assam Rifles) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, ఈ దాడికి ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక ట్రక్, పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని టెంగపాని (Tengapani) ప్రాంతంలో దుండగులు విడిచి పెట్టినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ ట్రక్‌ను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఉప్పర్ అస్సాంలో ఉన్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్-ఇండిపెండెంట్ (ULFA-I) ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.






