షాబాద్ లో పునరావృతం అవుతున్న మర్డర్లు..?

by Taduka Kalyani |

పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం? మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి.

షాబాద్ లో పునరావృతం అవుతున్న మర్డర్లు..?
X

దిశ, చేవెళ్ల : పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం? మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు.

మనిషి మృగంలా మారుతుంటే...!

మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. పేట్రేగిపోతున్న క్రైమ్‌ కల్చర్‌లో మానవ సంబంధాలనే మాట మంటగలిచి పోతోంది. క్షణికావేశంతో, వైవాహిక సుఖాల కోసం నేరాలకు పాల్పడి, తమ వాళ్లను తామే మట్టుబెట్టడం దేనికి సంకేతం..? కనిపెంచిన తల్లి, కట్టుకున్న భార్య, సర్వస్వం అనుకున్న భర్త… దీపం వెలిగించి… కుటుంబాల్ని బతికించి వెలుగులు ఇవ్వాల్సిన ఈ బంధాలే బతుకుల్ని బండ బారుస్తున్నాయి. నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. పంచభూతాల సాక్షిగా ఏర్పడిన బంధాల విలువను మర్చిపోయి, మానవ సంబంధాలు మట్టిలో కలిపేసి.. తమ జీవితాలను తామే కాలరాసుకుంటున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

డబ్బు, వివాహేతర హత్యలే ఎక్కువ..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనీ ఆయా ప్రాంతాల్లో ఈ మధ్య అనేక సంఘటన లు జరిగాయి. హత్యలకు డబ్బు, వివాహేతర సంబం ధాలు, ప్రేమ వ్యవహరాలే ప్రధాన కారణ మవుతున్నాయి. ఇరు జిల్లాలో ఇటీవల జరిగిన అన్ని హత్య కేసుల్లో డబ్బు, వివాహే తర సంబంధాలే జరిగాయన్నదే స్పష్టమ వుతుంది. అంతే కాక మద్యం మత్తులో విచక్షణ మరిచి హత్యలకు పాల్పడుతున్నట్లు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే అర్థ మవుతుంది. క్షణికావేశంలో హత్యలకు పాల్పడడం వల్ల వారు జైలు పాలై తమ జీవి తాలను కూడా నశానం చేసుకుంటున్నారు. తద్వారా భార్య పిల్లలు కూడా రోడ్డున పడు తున్నారు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను, కన్న తల్లిని, కన్నపిల్లలను హతమా రుస్తూ అనుబంధాలను దహనం చేస్తున్నా రు. తరుచూ చోటు చేసుకుంటున్న సంఘ టనలు సమాజంలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.

షాబాద్ అంటేనే హడల్..!
ప్రశాంత వాతావరణం నుంచి మళ్లీ ఉలిక్కిపాటు

ఒకప్పుడు షాబాద్ అంటేనే హత్యోదంతాలకు అడ్డా..షాబాద్ పేరు ఎత్తి తేనే హడాలి పోతుండేవారు. ఆ పాత రోజులు మళ్ళీ వస్తున్నాయా..? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆనాటి రోజులను జనం నెమరేసుకుంటున్నారు.

అప్పటి ఆయా దారుణ మరణకాండలకు నిలయం .. కానీ రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది.. దారుణహత్యలు...నేరాలు తగ్గుముఖం పట్టాయి.. అని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఓ ఉన్మాది ఆరుగురిని పొట్టన పెట్టుకోవడం మరోసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది.

అందరిలో గగుర్పాటును పెంచింది.. జనాల్లో భయాందోళన లను కలిగిస్తోంది. షాబాద్ మండలం కేరాఫ్ అడ్రస్ గా గతంలో జరిగిన సంఘటనలనుఓసారి పరిశీలిస్తే.... గతంలో దారుణాలు ఉండేవి...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 1988లో సంచలనం సృ ష్టించిన టీడీపీ నేత పట్నం రాజేందర్రెడ్డి దారుణ హత్య. ఎన్నికల ప్రచారం ముగించు కొని షాద్ నగర్ కు వచ్చి తిరిగి షాబాద్ మండలానికి తన వాహనంలో వస్తుండగా రాజేందర్రెడ్డిని షాబాద్ మండలం అంతారం గ్రామం వద్ద అడ్డుకొని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రతీకార దాడులు కూడా జరిగాయి. నాగరకుంట వద్ద 1990లో టీడీపీ నేత శ్రీపతిరెడ్డి హత్య ఈ నేపథ్యం లోనే జరిగింది. అంతేకాకుండా 1992లోయఅం తారం వద్ద న్యాయవాది జగన్ హత్యోదంతం కూడా ఇందులో భాగమేనన్ని.... ఇవన్నీ ప్రతీకార హత్యలు. ఆ తర్వాత 2003 ప్రాంతంలో చేత బడి చేశారన్న నెపంతో చందనవెల్లిలో బోనాల నర్సింలును, నాందార్ఖాన్పేట లో కిష్టయ్యను దారుణంగా హతమార్చారు.

1995లో మాజీ ఎంపీపీ కిష్టయ్యను కొందరు వ్యక్తులు షాబాద్ మండల కేంద్రం లో ఆయన ఇంట్లో కిరాతకంగా హత్య చేశారు. ఇది కాకుండా రేగడిదోసవాడ గ్రామంలో ఇరువ ర్గాల మధ్య వరుస ప్రతీకార హత్యలు జరి గాయి. అయితే రెండు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటనలు షాబాద్ మండలం లో తగ్గుముఖం పట్టాయి. ప్రశాంతం గా ఉన్న షాబాద్ ప్రేమోన్మాది ఆరుగురిని హత్య చేయడం తో మళ్లీ ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

అత్యంత పాశవికం

పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్న వ్యక్తి.. ఓ బాలికను ప్రేమించమని వేధించాడు. పోలీసు లను ఆశ్రయించిన ఆ బాలికను టార్గెట్ చేసి బెయిల్ మీద ఉన్న వ్యక్తి మరీ దారుణంగా హతమార్చడం.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని, నాయనమ్మను కూడా చంపడం సంచలనం సృ ష్టించింది. ఈ ఉన్మాది దారుణం ఇక్కడితో ఆగలేదు. ఇంటికి వెళ్లి ఎందుకు చంపావని ప్రశ్నించిన భార్యను, తన కడుపున పుట్టిన నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల పసికందును సైతం హతమార్చడం అతడి సైకోతనానికి పరాకాష్ట.

శుక్రవారం రాత్రి మొదలు పెట్టిన హత్యలు శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వ చ్చిన ఈ సంఘటన ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి ఉన్మాదిని ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన హత్యల ఘట నతో గతంలో జరిగిన ఘటనలు ప్రజలు నెమ రేసుకొంటున్నారు.

ట్యూషన్ తో మొదలైన పరిచయం... ప్రేమ గా మారి ఘోర విషాదం..!

అసలు నాగరాజు సరిత పరిచయo పరిశీలిస్తే విస్మయం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. పార్వతి సరిత దగ్గరికి రాజ్ కుమార్ ట్యూషన్ కోసం వెళ్లేవాడు. అలా వెళ్లిన వ్యక్తి టీచర్ ను ప్రేమిస్తున్నానని అప్పట్లోనే వేధింపులకు గురిచేశాడు. రాజ్ కుమార్ కంటే సరితనే ఆరు సంవత్సరాలు పెద్దది.. దీంతో సరిత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ తో పెళ్లికి నిరాకరించడం వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాను కు నిశ్చయించారు. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడడo తో చెడగొట్టి సరిత తల్లిదండ్రులను ఎదిరించి తను 2018లో సరితను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొద్దీ రోజులు సంసారం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్ కుమార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఆన్లైన్ గేమింగ్, జూదం, బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్.. తదితర వ్యసనాలకు బానిస అయ్యాడు. తీవ్రoగా అప్పుల పాలు కావడంతో గత అక్టోబర్ లోని ఆత్మహత్యత్నం చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కొంత పొలం అమ్మి అప్పులను తీర్చారు. షాబాద్ లో ఇల్లు కొనిచ్చి దైవాలగూడ నుంచి ఇక్కడికి మకాo మార్చాడు. ఈ సమయంలో పూర్తిగా తల్లిదండ్రులను నమ్మించిపొలం ను అమ్మి వేయించి...వారి నుండి మరింత డబ్బు తీసుకొని జల్సాలకు అలవాటు పడి భార్యను ప్రతిరోజు తాగొచ్చు వేధింపులకు గురిచేస్తుండేవాడని నిందితుని చెల్లెలుకు స్వయంగా సరిత చెప్పేదని రాజకుమార్ సోదరి వెల్లడించింది. దాదాపు రెండు కోట్లకు పైగా అప్పులు చేయడంతో భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగడంతో భర్త తీరుపై సరిత పంచాయతీ పెట్టింది. దీంతో సరిత సైతం తనకు విడాకులు ఇవ్వాలని పలుమార్లు పెద్దల ముందు పంచాయతీ పెట్టడంతో కక్ష పెంచుకున్న రాజకుమార్ ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని శుక్రవారం రాత్రి భార్య పిల్లల్ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆరు హత్యలకు సంచలనంగా రాజకుమార్ మారాడు.

రాజ్ కుమార్ 6 మంది ని హత్యలు చేయడంతో దైవాలకు గూడ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాడ్ని రానీ వాడు ఊళ్ళొకి.. వాడి సంగతి చెప్తామంటూ ధ్వజమెత్తుతున్నారు. తామే చందాలేసుకొని చంపుతామని హెచ్చరికలు చేస్తున్నారు. దైవాలగూడ గ్రామస్తులు రాజ్ కుమార్ ను నరరూప రాక్షసుడిగా అభివర్ణిస్తున్నారు.

Next Story