Drugs Case: పోలీసుల అదుపులో తహసీల్దార్.. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా..

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-25 13:58:31  IST  )

రాజమండ్రి తహసీల్దార్‌ మణిదీప్(Tahsildar Manideep) అరెస్ట్ అయ్యారు.

Drugs Case: పోలీసుల అదుపులో తహసీల్దార్.. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి తహసీల్దార్‌ మణిదీప్(Tahsildar Manideep) అరెస్ట్ అయ్యారు. సోమవారం ఆయన్ను హైదరాబాద్‌ పోలీసులు(Hyderabad Police) అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసు(Drugs Case)లో మణిదీప్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని అపార్ట్‌మెంట్‌లో పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా బర్త్ డే పార్టీ నిర్వహించడంతో పాటు, అక్రమంగా డ్రగ్స్ తీసుకోవడంతో పోలీసులు రాజమండ్రి తహసీల్దార్ సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కీలక నిందితుడు విక్రమ్ రెడ్డి, మరో ఇద్దరు యువతులు ఉన్నట్లు సమాచారం. మల్నాడు డ్రగ్స్ కేసులో విక్రమ్ రెడ్డి కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే పార్టీ కోసం బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

Read More..

భర్తకు లివర్‌ దానం చేసిన భార్య.. చికిత్స అనంతరం ఇద్దరు మృతి

Next Story