AP: రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన.. యువతి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారం

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-14 05:53:15  IST  )

తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులపై వరుసగా అత్యచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

AP: రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన.. యువతి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులపై వరుసగా అత్యచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నెలల నిండని చిన్నారుల నుంచి వృద్ధులపై కామాంధుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చిన అతివలపై అత్యాచారాల పర్వానికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా (Annamayya District) గుర్రంకొండ (Gurramkonda) మండల పరిధిలోని ప్యారంపల్లె (Pyarampalle)కు చెందిన ఓ యువతి (23)ని అమ్మచెరువు మిట్ట (Ammacheruvu Mitta)కు చెందిన గణేష్ (Ganesh) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 29న సదరు యువతికి తల్లిద్రండులు పెళ్లి నిశ్చయం చేశారు. అయితే, అది తట్టుకోలేని గణేష్ యువతిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అనుభవించి అంతమొందించాలని అనుకున్నాడు. యువతి ఒంటిరిగా వెళ్తుండగా.. గణేష్ ఆమెను వెంబడించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తలపై కత్తితో పొడిచాడు. అనంతరం నోట్లో యాసిడ్ (Acid) పోసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story