బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ సంస్థ.. పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

by Kema Shiva Kumar |

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు మోసాలకు తెగబడుతున్నారు.

బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ సంస్థ.. పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు మోసాలకు తెగబడుతున్నారు. బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి రాత్రి రాత్రే దుకాణం ఎత్తేసి సైలెంట్‌గా చెక్కేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గచ్చిబౌలి (Gachibowli)‌లో చోటుచేసుకుంది. ప్యూరో క్రియేషన్, ఐటీ సొల్యూషన్‌ (Puro Creation, IT Solution) పేరుతో సంస్థను స్థాపించిన నిర్వాహకులు తామే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించారు. దాదాపు 200 మంది నుంచి రూ.2.5 లక్షల మేర వసూలు చేశారు. రోజులు గస్తుండగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించగా.. గచ్చిబౌలిలో ఆఫీసును రాత్రి రాత్రి ఖాళా చేసి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ ఆప్ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్‌తో కలిసి గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story