శివబాలకృష్ణకు మరో షాక్.. ఇళ్లు, బినామీ సంస్థలపై ఈడీ రెయిడ్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 04:20:08  IST  )

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్‌ అయి జైలు నుంచి బయటకు వచ్చిన హెచ్ఎండీఏ (HMDA) మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna)కు మరో బిగ్ షాక్ తగిలింది.

శివబాలకృష్ణకు మరో షాక్.. ఇళ్లు, బినామీ సంస్థలపై ఈడీ రెయిడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్‌ అయి జైలు నుంచి బయటకు వచ్చిన హెచ్ఎండీఏ (HMDA) మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna)కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ECIR) కింద నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల లెక్క తేల్చేందుకు ఆయన పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థలు శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ SSV ప్రాజెక్ట్స్ కార్యాలయాలు, ఆ సంస్థల డైరెక్టర్ల ఇళ్లపై ఇవాళ ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొండాపూర్, రామాంతపూర్, లక్డీ‌కాపూల్ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆస్తులకు సంబంధించి పలు కీలక రికార్డులు, డిజిటల్ ఎవిడెన్స్‌లు, ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, జూలై 3న కూడా శివబాలకృష్ణకు చెందిన ఇళ్లలో ఈడీ అధికారులు రెయిడ్స్ నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని శివబాలకృష్ణ ఇంటితో పాటు చైతన్యనగర్‌లోని ఆయన సోదరుడు నవీన్‌ కుమార్‌ ఇంట్లో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరిపి కీలక పత్రాలను సీజ్ చేశారు. ఒకే నెలలో ఈడీ అధికారులు శివబాలకృష్ణ ఇంటిపై దాడులు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, గతంలో హెచ్‌ఎండీఏ (HMDA)లో ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో ప్లానింగ్‌ ఆఫీసర్‌గా, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)లో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతేడాది జనవరి 25న ఆయనతో పాటు నవీన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసింది. విచారణలో భాగంగా శివబాలకృష్ణ ఆయా వెంచర్లకు అడ్డగోలుగా పర్మీషన్లు ఇచ్చి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా వెల్లడైంది. హైదరాబాద్‌‌తో పాటు సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో 200 ఎకరాలకుపైగా భూములను కొనుగోలు చేసినట్లుగా తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.8.26 కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. ఓపెన్ మర్కెట్‌లో వాటి విలువ రూ.200 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.

Next Story