- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్లపై వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల ఘాట్ రోడ్లపై వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గత మూడు వారాలుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాల నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఓ టెంపో వాహనం కొండను ఢీకొట్టింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సేఫ్టీ వాల్, రెయిలింగ్ లేకపోవడంతో టెంపో నేరుగా కొండను తాకినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందంటున్నారు. ఈ ప్రమాదంలో టెంపో ముందుభాగం ధ్వంసమైంది.
Next Story






