కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |

విమానం కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలోని అరిజోనా స్టేట్ నవజో నేషన్‌ చోటుచేసుకుంది.

కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ వెబ్‌డెస్క్: విమానం కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలోని అరిజోనా స్టేట్ నవజో నేషన్‌ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్లే సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి రోగిని తీసుకెళ్లేందుకు ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. ఈ క్రమంలోనే ఫ్లైట్‌లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఫ్లైట్ కూలినట్లుగా చిన్లే పోలీసులు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. కూలిన విమానం బీచ్‌క్రాఫ్ట్ 300 అని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) అధికారులు పేర్కొన్నారు.

Next Story