HYD: కల్తీ కల్లు ఘటన.. మరొకరు మృతి

by Gantepaka Srikanth |

కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

HYD: కల్తీ కల్లు ఘటన.. మరొకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. కల్లు కాంపౌండ్‌లో కల్తీకల్లు(Kalthi kallu) తాగి నిన్న 19 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 15 మంది పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పరిస్థితి విషమించి ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు.. కల్లు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపించారు. బాధితులు సేవించిన మూడు కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశారు.

Next Story