- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరో కొత్త తరహా మోసం.. జలకన్య పేరు చెప్పి..
హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. జలకన్య కన్ను పేరుతో అమాయకులను బురిడి కొట్టించేందుకు కొందరు దుండగులు ప్రయత్నం చేశారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు లక్కీ స్టోన్‌లో లైట్ అమర్చి.. దానిని జలకన్య కన్ను పేరుతో రూ. 2 కోట్లకు విక్రయించేలా భారీ మోసానికి తెర లేపారు. కానీ పోలీసుల ఎంట్రీతో కేటుగాళ్ల సీన్ రివర్స్ అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు జలకన్య పేరుతో స్టోన్ అమ్మే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన చందు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసగాళ్లతొ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






