Fire Accident : ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-20 11:39:26  IST  )

హైదరాబాద్(Hyderabad) లోని గుల్జార్ హౌస్(Gulzar House Trgaedy) లో జరిగిన భారీ అగ్నిప్రమాద విషాదం మరవక ముందే.. మరోసారి ఓల్డ్ సిటీలో అగ్నిప్రమాదం(Old City Fire Accident) చోటు చేసుకుంది.

Fire Accident : ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని గుల్జార్ హౌస్(Gulzar House Trgaedy) లో జరిగిన భారీ అగ్నిప్రమాద విషాదం మరవక ముందే.. మరోసారి ఓల్డ్ సిటీలో అగ్నిప్రమాదం(Old City Fire Accident) చోటు చేసుకుంది. పాతబస్తీలోని ఛత్రినాక(Chatrinaka) పరిధిలోని బోయగూడలో ఓ భవనంలో రెండవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు, మంటలు వేగంగా వ్యాపించడంతో అప్రమత్తం అయిన భవనంలోని కుటుంబాలు వెంటనే బయటకు వచ్చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోర్ లో చెప్పుల గోదాం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. అదే విధంగా ఎవరికైనా గాయాలు అయ్యాయా.. ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మే 18న చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఏసీ పేలి మంటలు అంటుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నేడు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

Next Story