హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్ కలకలం.. లింగంపల్లిలో మరో చిన్నారి కిడ్నాప్

by Ajay Maddhiboyina |

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మరో చిన్నారి కిడ్నాప్ జరిగింది. నిద్రిస్తున్న తల్లి నుండి నెలల వయసు ఉన్న శిశువును మాయం చేశారు. శిశువును కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లినట్టు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు.

హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్ కలకలం.. లింగంపల్లిలో మరో చిన్నారి కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లలో కిడ్నాప్ గ్యాంగ్స్ కలకలం రేపుతున్నాయి. పదిహేను రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 3ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేయగా నేడు నిందితుడిని పట్టుకుని తల్లికి అప్పగించారు. ఈ ఘటన మర్చిపోకముందే లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మరో చిన్నారి కిడ్నాప్ జరిగింది. నిద్రిస్తున్న తల్లి నుండి నెలల వయసు ఉన్న శిశువును మాయం చేశారు. శిశువును కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లినట్టు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు.

ఇక సరగ్గా పదిహేను రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడేళ్ల నిఖిల్ అనే బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అమ్మమ్మతో స్టేషన్ కు వెళ్లిన నిఖిల్ ను ఓ కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. బాలుడి చేతిని అమ్మమ్మ తన కొంగుతో కట్టేసినప్పటికీ ఆమె నిద్రిస్తున్న సమయంలో నిందితుడు కిడ్నాప్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పదిహేను రోజుల తరవాత నిందితుడిని జీడిమెట్లలోని ఓ లాడ్జిలో గుర్తించారు. నిందితున్ని అరెస్ట్ చేసి బాలుడిని తల్లికి అప్పగించారు. ఈ ఘటన మర్చిపోకముందే లింగపల్లి రైల్వే స్టేషన్ లో చిన్నారి మాయం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్ లలో కిడ్నాప్ గ్యాంగ్ లు సంచరిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story