నగరంలో మరో అమానుష ఘటన.. కో పైలట్‌పై అత్యాచారం

by Kema Shiva Kumar |

దేశంలో కఠిన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ మహిళలపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు.

నగరంలో మరో అమానుష ఘటన.. కో పైలట్‌పై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కఠిన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ మహిళలపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. ముక్కుపచ్చలారని పసిపాప నుంచి పండుముసలి వరకు ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో ఓ మహిళా కో-పైలట్‌పై అత్యాచారం జరగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న బేగంపేట్ ఎయిర్‌పోర్టు (Begumpet Airport) నుంచి బెంగళూరు (Bengaluru)కు వెళ్లిన బిజినెస్ ఫ్లైట్ బయలుదేరింది. అక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత ఫ్లైట్‌లోని పైలట్లు బెంగళూరులోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ క్రమంలో పైలట్ రోహిత్ శరణ్ (Rohit Sharan) తన కో-పైలట్ (మహిళ)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్‌లోని బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story