రాష్ట్రంలో మరో భీకర ప్రమాదం.. ఎనిమిది మంది స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-24 07:23:26  IST  )

రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని తెన్కాసి (Tenkasi) జిల్లాలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో భీకర ప్రమాదం.. ఎనిమిది మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఇవా ఉదయం తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని తెన్కాసి (Tenkasi) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడయనల్లూరు సమీపంలోని ఇడైక్కల్ దురైసామిపురం వద్ద కేఎస్ఆర్టీసీ బస్సు, ఎంఆర్ గోపాల్ పేరుతో ఉన్న ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెన్కాసి జిల్లా కలెక్టర్ కమల్ కిషోర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తెన్కాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story