- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన మరో హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం
హెలికాప్టర్ కూలి ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఘనా (Ghana)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హెలికాప్టర్ కూలి ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఘనా (Ghana)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. Z-9 యుటిలిటీ హెలికాప్టర్ (Z-9 Utility Helicopter) బుధవారం ఉదయం రాజధాని అక్రా (Akra) నుంచి బయలుదేరి, అశాంతి ప్రాంతంలోని బంగారు గనుల ప్రాంతమైన ఒబువాసి వైపు వెళ్తుండగా రాడార్ నుంచి కనుమరుగైంది. అయితే, ఆ హెలికాప్టర్‌లో ఘనా రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమనే బోమా (Edward Omane Boma), పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తళా ముహమ్మద్ (Ibrahim Murtala Muhammad) ఉన్నారు. వారితో పాటు అధికార జాతీయ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఓ సీనియర్ జాతీయ భద్రతా సలహాదారు, హెలికాప్టర్ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలిపోవడంతో వారంతా కాలిబూడిదయ్యారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం ‘జాతీయ విషాదం’గా పేర్కొంది.






