రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. నలుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

ఏకంగా నలుగురు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లోని సీకర్ (Seeker) నగరంలో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. నలుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏకంగా నలుగురు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లోని సీకర్ (Seeker) నగరంలో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాల్వాస్ రోడ్‌ (Palvas Road)లోని అనిరుద్ధ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక మహిళతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

అయితే, ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో పొరుగు వారు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు స్పాట్‌కు చేరుకుని ఫ్లాట్ తలుపులు తెరచి చూడగా.. ఆచేతన స్థితిలో డెడ్‌బాడీలు పడి ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా వారంతా మూడు, నాలుగు రోజుల క్రితం ఆత్యహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. మృతుల్లో తల్లి పింకీ చౌదరి (45) పెద్ద కుమారుడు సుమిత్ చౌదరి (18), కుమార్తె స్నేహా (15), ఒక చిన్న కుమారుడు (5), అతి చిన్న బిడ్డ (1) ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, వారంతట వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక.. ఎవరైనా చంపారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story