- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద(Chevella Bus Accident) ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద(Chevella Bus Accident) ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru Bus Accident) జిల్లా లింగాపాలె పరిధిలోని జూబ్లీనగర్ దగ్గర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ఏలూరి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. భారతి ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఉదయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మీర్జాగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో.. కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన మరువకముందే ఏలూరులో మరో బస్సు ప్రమాదం జరుగడం కలకలం రేపుతోంది.






