వడ దెబ్బకు మరో రైతు మృతి

by Ratna Kumari |

రాష్ట్రంలో ఎండ‌లు విఫ‌రీతంగా ఉన్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకు వ‌డ దెబ్బ కార‌ణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది.

వడ దెబ్బకు మరో రైతు మృతి
X

దిశ, ఏటూరు నాగారం : రాష్ట్రంలో ఎండ‌లు విఫ‌రీతంగా ఉన్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకు వ‌డ దెబ్బ కార‌ణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగ‌ళ‌వారం మ‌రో వృద్ధ రైతు మృతి చెందిన సంఘ‌ట‌న ఏటూరు నాగారం మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్రం ఓడ గూడానికి చెందిన క‌ర్ల న‌ర్స‌య్య అనే రైతు ఎండ తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక ఊపిరి ఆడ‌క‌పోతే స్థానిక వ‌ర‌ప్ర‌సాద్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ న‌ర్స‌య్య మృతి చెందాడ‌ని కుటుంబీకులు తెలిపారు. ఇంటి య‌జ‌మాని కోల్పోవ‌డంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డింది. ప్ర‌భుత్వం న‌ర్స‌య్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని కోరుతున్నారు.

Next Story