గంగలూర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 06:43:43  IST  )

భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఎదురుకాల్పులు జరిగాయి.

గంగలూర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
X

దిశ, భద్రాచలం: భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. గంగలూర్ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, లోకల్ పోలీసులతో కలిసి కూబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరుపక్షాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

Next Story