- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవులు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా దద్దరిల్లాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవులు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా ఆ ప్రాంతం మొత్తం తుపాకుల శబ్ధంతో రణరంగంగా మారింది. సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో జిరగినో ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్ కౌంటర్ పై పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో.. "బెజ్జి, చింతగుఫా పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతంలోని తుమల్‌పాడ్ అడవి, కొండ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఆ ప్రాంతంలో శోధన ఆపరేషన్ ప్రారంభించింది. శోధన ఆపరేషన్ సమయంలో, ఉదయం DRG జవాన్లకు, మావోయిస్టుల ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు కాల్పులు పార్రంభించగా.. పోలీసులు, జవాన్లు వారి కాల్పులను బలంగా తిప్పికొట్టారు. ఇందులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, తుమల్‌పాడ్ ఎన్‌కౌంటర్ సైట్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ముగ్గురు మావోయిస్టు కేడర్ నేతలు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
వారిని మాద్వి దేవా - జన్మిలిటియా కమాండర్, స్నిపర్ స్పెషలిస్ట్, కొంటా ఏరియా కమిటీ సభ్యురాలు కాగా ఆమెపై రివార్డ్ మొత్తం ₹5 లక్షల రివార్డు ఉంది. పోడియం గంగి - కొంటా ఏరియా కమిటీ CNM కమాండర్ కాగా.. అతనిపై మొత్తం ₹5 లక్షల రివార్డు ఉంది. అలాగే సోడి గంగి - కిస్తారామ్ ఏరియా కమిటీ సభ్యులు. ఇతనిపై మొత్తం ₹5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ పై బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సుందర్‌రాజ్ పట్టలింగం మాట్లాడుతూ.. బస్తర్‌లో మావోయిస్టువాదం ఇప్పుడు చివరి దశలో ఉందని, మావోయిస్టు కార్యకర్తలు హింసను విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాస విధానాన్ని స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.
ఆ సంస్థ పట్టు విరిగిపోయిందని, బస్తర్‌లో భీభత్సం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి వారి కుట్ర ఇకపై పనిచేయదని ఆయన హెచ్చరించారు. బస్తర్‌లో మిగిలిన నక్సలైట్ స్థావరాలను పోలీసులు, భద్రతా దళాలు, వివిధ వాటాదారుల ఉమ్మడి కార్యకలాపాలు వేగంగా నిర్మూలిస్తున్నాయని ఐజి పేర్కొన్నారు. 2025లో ఇప్పటివరకు బస్తర్ రేంజ్‌లో కేంద్ర కమిటీ సభ్యులు, DKSZC సభ్యులు, PLGA క్యాడర్‌లతో సహా మొత్తం 233 మంది మావోయిస్టులు మరణించారని, ఇది మావోయిస్టు నిర్ణయాత్మక ఓటమికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్ కౌంటర్ అనంతరం DRG, బస్తర్ ఫైటర్స్, CRPF ఇతర భద్రతా దళాలు పరిసర ప్రాంతంలో విస్తృతమైన సోదాలు నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.






