- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాకీతో కాల్చుకొని మరో కానిస్టేబుల్ ఆత్మహత్య
by Muthe.Rajitha |
ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ స్వస్థలం నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్. కాగా వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సందీప్ సంగారెడ్డి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలను కనుక్కుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. అయితే గత రెండు నెలల్లోనే ఐదుగురు కానిస్టేబుల్స్ సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం అంటున్నారు మానసిక నిపుణులు.
Next Story






