టాలీవుడ్ యంగ్ హీరో‌పై మరో కేసు నమోదు

by Gantepaka Srikanth |

టాలీవుడ్ యంగ్ హీరో‌పై మరో కేసు నమోదు

టాలీవుడ్ యంగ్ హీరో‌పై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో రాజ్ తరుణ్‌(Raj Tarun)పై మరో కేసు నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ అయింది. జూన్ 30న తన అనుచరులతో కలిసి రాజ్ తరుణ్ నా కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య(Lavanya) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. కాగా, 2016లో హీరో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో విల్లా కొనుగోలు చేశానని, వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చి నెలలో రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేశాడని లావణ్య తెలిపింది.

Next Story