గుజరాత్‌లో కూలిన మరో వంతెన.. 10 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-09 06:56:10  IST  )

నదిపై మరో వంతెన కుప్పకూలిన ఘటన గుజరాత్ (Gujrat) రాష్ట్రంలోని పద్రా (Padra)లో చోటుచేసుకుంది.

గుజరాత్‌లో కూలిన మరో వంతెన.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నదిపై మరో వంతెన కుప్పకూలిన ఘటన గుజరాత్ (Gujrat) రాష్ట్రంలోని పద్రా (Padra)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహిసాగర్‌ నది (Mahi Sagar River)పై వడోదర-ఆనంద్‌ పట్టణాలను కలుపుతూ నిర్మించిన గంభీర-ముజ్‌పూర్ వంతెన ఇవాళ ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బ్రిడ్జిపై వెళ్తున్న ఓ ట్రక్కు, బొలెరో‌తో పాటు మరో రెండు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ మేరకు వడోదర జిల్లా అధికారులు స్పాట్ చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్క్యూ టీమ్ ఇప్పటి నలుగురిని నదిలోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. అదేవిధంగా మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పద్రా ఎమ్మెల్యే చైతన్య సింహ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే, అధికారులు వంతెనకు మెయిన్‌టెన్స్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సోషల్ మీడియాలో వార్తలో వస్తు్న్నాయి.

ప్రమాద దృశ్యాలు ఎక్స్‌క్లూజివ్.. https://x.com/AmitChavdaINC/status/1942780277027201251

Next Story