- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. భద్రతా బలగాల చేతికి భారీ ఆయుధాల డంప్
by Kema Shiva Kumar |
ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా భద్రతా బలగాలు చేపడుతోన్న వరుస కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టుల మనుగుడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

X
దివ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా భద్రతా బలగాలు చేపడుతోన్న వరుస కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టుల మనుగుడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కంచల్ (Kanchal) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ చేపడుతుండగా ఓ భారీ సొరంగంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్ (Weapons Dump) లభ్యమైంది. ఆ డంప్‌లో గ్రనైడ్ లాంఛర్లు, గన్ పౌడర్, డిటోనేటర్లు, ఇన్వర్టర్లు, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున లభ్యమయ్యాయి. అదేవిధంగా విస్పోటనం సృష్టించే ఆర్డీఎక్స్‌తో పాటు రైఫిల్ బయోనెట్‌లు, ఇనప రాడ్లు, కట్టర్లను కూడ స్వాధీనం చేసుకున్నారు. అయితే భద్రతా బలగాలు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆయుధాల డంప్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దదని పోలీసు అధికారులు వెల్లడించారు.
Next Story






