- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: మరో బండి సంజయ్ సన్నిహితుడి ఫోన్ ట్యాప్.. నిర్ధారించిన సిట్ అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. బీజేపీ(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి(Gangidi Manohar Reddy) ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు నిర్దారించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డికి సిట్ పోలీసులు ఫోన్ చేశారు. 2, 3 రోజుల్లో వీలు చూసుకుని విచారణకు రావాలని కోరారు. కాగా, బండి సంజయ్‌కు మనోహర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra)కు మనోహర్ రెడ్డి ఇన్‌చార్జీగా వ్యవహరించారు. అంతేగాకుండా.. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ కోఆర్డినేటర్‌గానూ పనిచేశారు. కాగా, బండి సంజయ్(Bandi Sanjay) సన్నిహితులు, సిబ్బంది ఫోన్లు సైతం గతంలో ట్యాపింగ్‌కు గురయ్యాయి. సిట్ విచారణలో దీనికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్ బీజేపీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు ఫోన్ చేశారు. నోటీసులు పంపిస్తామని.. వచ్చి వివరణ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు.






