- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో దారుణం.. అడవిలో భార్యను చంపి కాల్చిన భర్త
భార్యను అడవిలో హతమార్చి కాల్చి వేసిన భర్త సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటు చేసుకుంది.పెద్ద కొత్తపల్లి పోలీసులు భర్త పై కేసు నమోదు చేసి నమోదు దర్యాప్తు జరుపుతున్నారు.

దిశ, పెద్ద కొత్తపల్లి: భార్యను అడవిలో హతమార్చి కాల్చి వేసిన భర్త సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటు చేసుకుంది.పెద్ద కొత్తపల్లి పోలీసులు భర్త పై కేసు నమోదు చేసి నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అడవి ప్రాంతంలో భార్యను హత్య చేసి కాల్చి చంపిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం అనే యువకుడు 2014 లో మహబూబ్ నగర్ కు చెందిన శ్రావణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో వీరికి బాబు, కూతురు ఉన్నారు.
ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉండడంతో శ్రావణి మహబూబ్ నగర్ లో పిల్లలతో ఉంటుంది. ఈనెల 21వ తేదీన భర్త శ్రీశైలం మహబూబ్ నగర్ వెళ్లి భార్యతో బైక్ పై సోమశిల కు వెళ్దామని మాయమాటలు చెప్పి పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అడవి ప్రాంతంలోకి తీసువెళ్లాడు. అక్కడ శ్రావణిని హత్య చేసి కాల్చి చంపాడు. దీంతో శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. శ్రావణిని తానే చంపానని హత్య చేసిన స్థలాన్ని చూపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలపారు.
Also Read..
"నన్ను ఎందుకు వదిలేశావ్ నిక్కీ".. భార్యను హత్య చేసిన తరవాత ఇన్‌స్టాలో భర్త నట విశ్వరూపం






