"నన్ను ఎందుకు వదిలేశావ్ నిక్కీ".. భార్యను హత్య చేసిన తరవాత ఇన్‌స్టాలో భర్త నట విశ్వరూపం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-24 15:24:52  IST  )

అదనపు కట్నం కోసం నోయిడాలో భర్త భార్య‌ను బ‌తికుండ‌గానే పెట్రోల్ పోసి హ‌త్య చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. నోయిడాకు చెందిన విపిన్ అనే వ్య‌క్తి త‌న భార్య నిక్కీ 26ను అత్యంత దారుణంగా హ‌తమార్చ‌డం సంచ‌ల‌నంగా మారింది.

నన్ను ఎందుకు వదిలేశావ్ నిక్కీ.. భార్యను హత్య చేసిన తరవాత ఇన్‌స్టాలో భర్త నట విశ్వరూపం
X

దిశ‌, వెబ్ డెస్క్: అదనపు కట్నం కోసం నోయిడాలో భర్త భార్య‌ను బ‌తికుండ‌గానే పెట్రోల్ పోసి హ‌త్య చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. నోయిడాకు చెందిన విపిన్ అనే వ్య‌క్తి త‌న భార్య నిక్కీ 26ను అత్యంత దారుణంగా హ‌తమార్చ‌డం సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు నింధితున్ని అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వారిపైనే కాల్పులు జ‌రిపాడు. దీంతో పోలీసులు అత‌డి కాలిలో బుల్లెట్ దింపి అరెస్ట్ చేశారు. నిందితున్ని ఎన్కౌంట‌ర్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో హ‌త్య త‌ర‌వాత అత‌డి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. భార్య‌ను హ‌త్య చేసి అనంత‌రం అత‌డు ఇన్ స్టాలో మ‌స‌లిక‌న్నీరు కార్చ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అరెస్టుకు కొన్ని గంట‌ల ముందే నిందితుడు... నా భార్య న‌న్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది కాబ‌ట్టి ప్ర‌పంచం న‌న్ను హంత‌కుడు అని పిలుస్తుంది. ఏం జ‌రిగిందో నువ్వు నాకు ఎందుకు చెప్ప‌లేదు? న‌న్ను కూడా నీతో తీసుకెళ్ల‌కుండా ఎందుకు వ‌దిలేశావు. ఇలా ఎందుకు చేశావు? ప్ర‌పంచం న‌న్ను కిల్ల‌ర్ అని పిలుస్తుంది నిక్కీ అంటూ త‌న పోస్టులో ఎమోష‌న‌ల్ అయ్యాడు. భార్య‌ను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు అన్ని ఆధారాలు సేక‌రించిన త‌ర‌వాత సైతం ప్ర‌జ‌ల‌ను, పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు నిందితుడు ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్ట‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. మ‌రోవైపు పోలీసుల నుండి త‌ప్పించుకునేంద‌కు వారిపైనే కాల్పులు జ‌ర‌ప‌డం అత‌డి క్రూర‌మైన మైండ్ సెట్ కు అద్దం ప‌డుతోంది.

Also Read..

రాష్ట్రంలో మరో దారుణం.. అడవిలో భార్యను చంపి కాల్చిన భర్త

Next Story