నగరంలో మరో దారుణం.. మర్మాంగాలను పీక్కుతిన్న పెంపుడు కుక్క

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-05 03:42:35  IST  )

ఇంటికి కాపలాగా ఉండి యజమానిని కంటికిరెప్పలా కాపాడాల్సిన ఆ పెంపుడు కుక్క.. ఏకంగా కాటికి పంపేలా చేసింది.

నగరంలో మరో దారుణం.. మర్మాంగాలను పీక్కుతిన్న పెంపుడు కుక్క
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటికి కాపలాగా ఉండి యజమానిని కంటికిరెప్పలా కాపాడాల్సిన ఆ పెంపుడు కుక్క.. ఏకంగా అతడిని కాటికి పంపేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మధురా నగర్‌ (Madhura Nagar) ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్ కుమార్ (37) నివాసం ఉంటున్నాడు. అయితే, ఆదివారం రాత్రి తన పెంపుడు కుక్కను రోజూలాగే తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దారుణం చోటుచేసుకుంది. పవన్ కుమార్ మర్మాంగాలను ఆ పెంపుడు కుక్క కొరుక్కు తినేసింది. దీంతో బాధితుడు రక్తపు మడగులో కొట్టుమిట్టాడుతూ.. ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం పవన్ స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా.. ఎంతకీ అతడు డోర్ ఓపెన్ చేయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. అచేతన స్థితిలో పవన్ కుమార్ పడి ఉన్నాడు. అక్కడే ఉన్న పెంపుడు కుక్క నోటి నిండా రక్తంతో కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Next Story