- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాల్కన్ స్కామ్‌లో మరో నిందితుడి అరెస్ట్
క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐడీ డీజీ శిఖా గోయల్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐడీ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఏ21 నిందితుడిగా పేర్కోన్న సందీప్ కుమార్‌ను, అతనికి ఆశ్రయం ఇచ్చిన మరో వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు బుధవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ చేయబడిన సందీప్ కుమార్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఏ2గా ఉన్న అమర్ దీప్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీ అండ్ ఎండి సోదరుడని తెలిపారు. కంపెనీ అపరేషన్ హెడ్‌గా వ్యవహిరించారని తెలిపారు. అతనికి ఆశ్రయం కల్పించి అరెస్ట్ అయిన మరో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ పని చేసే రవిగా గుర్తించిన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 2.5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రేంజ్ రోవర్ వెలార్ కారు, ఇన్నోవా క్రిస్టా కార్లను , రూ. 10 కోట్ల విలువైన 14 ప్రాపర్టీ డాక్యమెంట్స్ ను, 3 మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు , నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, రాజస్థాన్, ఎపీ ఢిల్లీలలో నిందితుడైన కంపెనీ డైరెక్టర్లపై మరో 8కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసు నమోదు సమయంలో సందీప్ కుమార్ ఇండియా నుంచి దుబాయి పారిపోయాడని , నేపాల్ గుండా మళ్లీ భారత్‌లోకి ప్రవేశించాడని దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. సందీప్ కుమార్ భార్యని, తండ్రిని మే 17వ తేదిన బీహర్‌లో అరెస్టు చేసినట్లు, ఆ సమయంలో అతను తప్పించుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా, గోవా ప్రాంతాలలో తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరకున్నాడని విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. హైదరాబాద్లో రవి అనే కజిన్ దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిపారు. కంపెనీల డిపాజట్ల నుంచి రూ.8.5 కోట్లు తన సొంత ఎకౌంట్స్‌కు తరలించుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ పేరుతో నకిలీ ఒప్పందాలను సృష్టించి , స్వల్పకాలిక ప్రణాళికలతో అధిక వడ్డీ రేట్ల సాకుతో డిపాజిటర్లను ప్రలోభపెట్టి 7056 డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 4065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్లు మోసాలకు పాల్పడ్డరని తెలిపారు. ఎస్పి, ఇఓడబ్ల్యూ, సిఐడి వెంకట లక్ష్మి, ఇఓడబ్ల్యూ డిఎస్పి ఎన్.అశోక్ కుమార్ పర్యవేక్షణలో వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.






