- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి హత్య కేసులో బీజేపీ మాజీ మంత్రి కుమారుడికి జీవిత ఖైదు!
ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపిన యువతి హత్య కేసులో బీజేపీ మాజీ మంత్రి కుమారుడితో సహా మరో ఇద్దరికి కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. 2022లో అంకిత్ బండారి అనే

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపిన యువతి హత్య కేసులో బీజేపీ మాజీ మంత్రి కుమారుడితో సహా మరో ఇద్దరికి కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. 2022లో అంకిత్ బండారి అనే యువతిని ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, బీజేపీనేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తా అనే ముగ్గురు యువకులు గంగానదిలో తోసి హత్య చేశారు. యువతి పుల్కిత్ ఆర్యకు చెందిన ఓ రిసార్ట్స్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండగా రిసార్ట్ మ్యానేజర్‌గా భాస్కర్, అసిస్టెంట్ మ్యానేజర్‌గా అంకిత్ గుప్తా అదే రిస్టార్ట్స్‌లో ఉద్యోగం చేసేవారు.
కాగా మంత్రి కుమారుడితో పాటూ ఇద్దరు ఉద్యోగులు కలిసి చిన్న వివాదం కారణంగా అంకిత్ బండారిని నదిలో తోసి హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక టీమ్‌తో విచారణ జరిపించింది. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ఇక నేడు ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లోని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. పుల్కిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలు ముగ్గురినీ నింధితులుగా తేల్చింది. ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరికి జీవితఖైదు విధించింది. అంతే కాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం కూడా ఇవ్వాలని తీర్పునిచ్చింది. దోషులకు శిక్ష పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.






