అంగ‌న్ వాడీ టీచ‌ర్ మృతి

by Ratna Kumari |

దిశ‌, కారేప‌ల్లి రూరల్ : ఎన్నిక‌ల విధుల్లో అంగ‌న్ వాడీ టీచ‌ర్ అస్వ‌స్థ‌త‌కు గురైంది. విధుల్లో ఉండ‌గానే ఉన్న‌ట్టుండి

అంగ‌న్ వాడీ టీచ‌ర్ మృతి
X

దిశ‌, కారేప‌ల్లి రూరల్ : ఎన్నిక‌ల విధుల్లో అంగ‌న్ వాడీ టీచ‌ర్ అస్వ‌స్థ‌త‌కు గురైంది. విధుల్లో ఉండ‌గానే ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా సొమ్మసిల్లి ప‌డిపోయింది. దీంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ అంగ‌న్ వాడీ టీచ‌ర్ మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న శుక్రవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తున్న వనపట్ల విజయ కుమారి(51)కి మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా కొనిజర్ల మండలంలో ఈనెల 10వ తేదీన డ్యూటీలో పాల్గొన్న ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో సంబంధిత అధికారులు ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చనిపోయిన అంగన్‌వాడీ టీచర్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గ్రామంలో ఆందోళన చేశారు.

Next Story